విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలి: మాధవ్

ABN , First Publish Date - 2020-10-19T20:16:21+05:30 IST

విశాఖ: పాడేరు ఐటీడీఏ వద్ద రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీ నిర్వహించింది.

విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలి: మాధవ్

విశాఖ: పాడేరు ఐటీడీఏ వద్ద రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీ నిర్వహించింది. పాడేరు ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఐటీడీఏ వరకు ఈ ర్యాలీ నిర్వహించింది. అనంతరం ఐటీడీఏ వద్ద ధర్నా నిర్వహించింది. ర్యాలీలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. ఉత్తమ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులను యథావిధిగా కొనసాగించాలన్నారు. అన్ని రకాల పిజులను ప్రభుత్వమే చెల్లించాలని మాధవ్ డిమాండ్ చేశారు. జీవో నంబర్ 3 అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన యువతీ యువకులకు ఇచ్చే ట్రైకార్ రుణాల విషయంలో పాత విధానాన్నే కొనసాగించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గిరిజనులకే వినియోగించాలన్నారు. ప్రతి మూడు నెలలకు తప్పకుండా ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-10-19T20:16:21+05:30 IST