సస్పెండ్ చేసి మళ్లీ ఓటేయమనడం ఏంటీ..?.. చంద్రబాబును ప్రశ్నించిన మద్దాల గిరి

ABN , First Publish Date - 2020-06-19T22:16:18+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబును ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే మద్దాల గిరి సూటిగా ప్రశ్నించారు. గెలవం అని తెలిసి వర్ల రామయ్యకు టిక్కెట్ ఇచ్చారని, గెలిచే సమయంలో వర్ల రామయ్య గుర్తుకు రాలేదా..?

సస్పెండ్ చేసి మళ్లీ ఓటేయమనడం ఏంటీ..?.. చంద్రబాబును ప్రశ్నించిన మద్దాల గిరి

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబును ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే మద్దాల గిరి సూటిగా ప్రశ్నించారు. గెలవం అని తెలిసి వర్ల రామయ్యకు టిక్కెట్ ఇచ్చారని, గెలిచే సమయంలో వర్ల రామయ్య గుర్తుకు రాలేదా..? అని గిరి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు పక్కనున్న బ్యాచ్‌ను పక్కన పెడితే బెటర్‌ అని సూచించారు. ఇప్పటికైనా చంద్రబాబు పార్టీపై దృష్టిపెడితే మంచిదని సలహా ఇచ్చారు. ఆయనకు ఓపిక లేకపోతే.. సీటులో లోకేష్‌నైనా కూర్చోబెట్టాలని గిరి సూచించారు. టీడీపీ జారీ చేసిన విప్ తనకు అందలేదని చెప్పారు. గతంలో తులాభారం వేసి చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చారని, చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. అందుకే ఒక్క పొలింగ్ ఏజెంట్ కూడా టీడీపీ ఎమ్మెల్యే లేరని ఎద్దేవాచేశారు. టీడీపీకి 17 ఓట్లు మాత్రమే పడ్డాయని తెలిపారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసి మళ్లీ ఓటేయమనడం ఏంటీ అని చంద్రబాబును ప్రశ్నించారు. తనను స్పీకర్ ప్రత్యేక సభ్యునిగా గుర్తించారని మద్దాల గిరి తెలిపారు.

Updated Date - 2020-06-19T22:16:18+05:30 IST