ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల గడువు 3 నెలలు పొడిగింపు

ABN , First Publish Date - 2020-04-07T10:38:58+05:30 IST

ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌.ఆర్‌.ఎస్‌.) కింద రాష్ట్రంలో అనధీకృత, నిబంధనలకు వ్యతిరేకంగా వెలసిన లేఅవుట్లు, స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే గడువును 3 నెలలపాటు పొడిగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారంనాడు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల గడువు 3 నెలలు పొడిగింపు

ఆంధ్రజ్యోతి, అమరావతి: ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌.ఆర్‌.ఎస్‌.) కింద రాష్ట్రంలో అనధీకృత, నిబంధనలకు వ్యతిరేకంగా వెలసిన లేఅవుట్లు, స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే గడువును 3 నెలలపాటు పొడిగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారంనాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన ప్రకటించిన ఈ పథకం గడువు ఈ నెల 7వ తేదీతో ముగిసిపోనుంది. అయితే ఈ కాలవ్యవధిని 3 నెలలపాటు అంటే ఈ సంవత్సరం జులై మొదటి వారం వరకు పొడిగించారు.


డీటీసీపీ వి.రాముడు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన అభ్యర్థనను పురస్కరించుకుని నిర్ణయం తీసుకున్నట్టు శ్యామలరావు పేర్కొన్నారు.  ఎల్‌ఆర్‌ఎస్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర వరకు దరఖాస్తులు అందుతాయని అధికారవర్గాలు అంచనా వేశాయి. అయితే నిర్ణీత గడువైన 3 నెలలు ముగిసేసరికి కేవలం 7,000 వరకు అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. ఇందుకు మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియతోపాటు కరోనా వైరస్‌ కల్లోలం ముఖ్య కారణాలని అధికారులు భావిస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. 

Read more