-
-
Home » Andhra Pradesh » Low pressure in 48 hours
-
48 గంటల్లో అల్పపీడనం
ABN , First Publish Date - 2020-05-13T09:35:40+05:30 IST
దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది.

విశాఖపట్నం, అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత రెండు రోజుల్లో అల్పపీడనం బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. కాగా, మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా కర్ణాటక వరకు మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు ఎండ తీవ్రంగా ఉంది. మంగళవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం లోని వాతావరణ కేంద్రం తెలిపింది.