ఏపీలో హిందూ దేవుళ్లపై ఏమిటీ కక్ష సాధింపు?

ABN , First Publish Date - 2020-12-31T00:56:25+05:30 IST

ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని..

ఏపీలో హిందూ దేవుళ్లపై ఏమిటీ కక్ష సాధింపు?

అమరావతి: ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లారు. రామతీర్థంలోని శ్రీరామస్వామి దేవస్థానం పక్కనే సుమారు 800 అడుగుల ఎత్తులో ఉన్న బోడికొండపై కోదండ రామాలయం ఉంది. మంగళవారం ఉదయం అర్చకుడు వెళ్లేసరికి ఆలయ తలుపులకు తాళం లేకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. వారు నెల్లిమర్ల పోలీసులకు తెలిపారు. అందరూ కలసి ఆలయం లోపల పరిశీలించగా శ్రీరామచంద్రస్వామి విగ్రహం తల తెగి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే తల భాగం కోసం పరిసరాల్లో వెతికినా ఎక్కడా దొరకలేదు. పోలీస్‌ జాగిలాలు, క్లూస్‌ టీమ్‌ ప్రతినిధులు ఆధారాల సేకరణ జరుగుతోంది.


ఈ నేపథ్యంలో  ‘‘హిందూ దేవుళ్లపై ఏమిటీ కక్ష సాధింపు?. విగ్రహాలను ధ్వంసం చేస్తున్న శాడిస్టులెవరు?. హైందవ ధర్మాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందా?. వరుస ఘటనలు జరుగుతున్నా ఒక్కడ్ని కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు?. హిందూధర్మ పరిరక్షకులుగా చెప్పుకునే వారు ఏమైపోయారు?. రాముడి విగ్రహం తల నరికేయడం అరాచకాలకు పరాకాష్ట కాదా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2020-12-31T00:56:25+05:30 IST