ఫార్మాసిటీలో పేలుడు దృశ్యాలు బాధ కలిగించాయి : లోకేష్

ABN , First Publish Date - 2020-07-14T16:12:33+05:30 IST

విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో సోమవారం

ఫార్మాసిటీలో పేలుడు దృశ్యాలు బాధ కలిగించాయి : లోకేష్

విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో సోమవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల ప్రాంతంలో సాల్వెంట్ ప్లాంట్‌లో జరిగిన ఈ భారీ పేలుడుతో వైజాగ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశాఖ ఫార్మాసిటీలో పేలుడు దృశ్యాలు బాధ కలిగించాయన్నారు. మంటలు అదుపులోకి తెచ్చి.. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను ప్రాణాలతో కాపాడాలని ఆయన కోరారు. ఈ ట్వీట్‌కు ప్రమాదానికి సంబంధించిన వీడియోను సైతం లోకేష్ జత చేశారు.

Updated Date - 2020-07-14T16:12:33+05:30 IST