‘పొలిటికల్ డాక్టర్’ కోడెల.. లోకేశ్ ట్వీట్

ABN , First Publish Date - 2020-09-16T16:52:15+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ దివంగత డాక్టర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.

‘పొలిటికల్ డాక్టర్’ కోడెల.. లోకేశ్ ట్వీట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ దివంగత డాక్టర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. డాక్టరుగా పేదలకు సేవచేయడంతో పాటు, పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్సచేసి శాంతిని, అభివృద్ధిని అందించి, ఆరోగ్యకర సమాజానికి బాటలు వేసిన పొలిటికల్ డాక్టర్ కీర్తిశేషులు కోడెల శివప్రసాదరావు అంటూ ట్వీట్ చేశారు. అవినీతిపరుల కక్షలు, కుట్రల కారణంగా ఆయన మనకు దూరమై ఏడాది గడిచిందని పేర్కొన్నారు. మూడున్నర దశాబ్దాల రాజకీయజీవితంలో ఎన్‌టీఆర్‌, చంద్రబాబు మంత్రి వర్గాల్లో పనిచేసి మచ్చలేని నాయకుడిగా పేరుపొందారన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి శాసన సభాపతిగా తన వ్యక్తిత్వంతో ఆ పదవికే వన్నె తెచ్చారని గుర్తు చేసుకున్నారు. కోడెల ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పించారు. 



Updated Date - 2020-09-16T16:52:15+05:30 IST