జర్నలిస్టులకు లోకేశ్‌ ‘బీమా’

ABN , First Publish Date - 2020-07-20T08:13:13+05:30 IST

కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల్ని చైతన్యపరిచేందుకు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తో కలిసి పనిచేస్తూ వైరస్‌ బారినపడి ..

జర్నలిస్టులకు లోకేశ్‌ ‘బీమా’

అమరావతి/మంగళగిరి, జూలై 19(ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల్ని చైతన్యపరిచేందుకు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తో కలిసి పనిచేస్తూ వైరస్‌ బారినపడి రోజుకో జర్నలిస్టు మృత్యువాత పడడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేసమయంలో తనవంతు సాయంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని 62 మంది ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా పాత్రికేయులకు బీమా సౌకర్యం కల్పించారు.


ఈ నెల 15 నుంచే ఈ బీమా అమల్లోకి వచ్చింది. బీమా పొందిన పాత్రికేయుల్లో ఎవరైనా సహజ మరణం(కరోనా మృతి కూడా) పొందితే ఆ కుటుంబానికి రూ.10 లక్షలు, ప్రమాదం కారణంగా మృతి చెందితే రూ.20 లక్షలు అందిస్తారు. త్వరలోనే బీమా పత్రాలను ఆయా పాత్రికేయులకు అందిస్తామని లోకేశ్‌ ఆదివారం తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులందరికీ ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని, పీపీఈ కిట్లు అందించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-20T08:13:13+05:30 IST