ఎక్కడ ఆగిందో అక్కడినుంచే మొదలెడతాం: లోకేష్

ABN , First Publish Date - 2020-03-02T23:55:25+05:30 IST

ప్రజాచైతన్య యాత్ర ఎక్కడ ఆగిందో అక్కడినుంచే మొదలెడతామని..

ఎక్కడ ఆగిందో అక్కడినుంచే మొదలెడతాం: లోకేష్

అమరావతి: ప్రజాచైతన్య యాత్ర ఎక్కడ ఆగిందో అక్కడినుంచే మొదలెడతామని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 300 మంది పులెవెందుల రౌడీలను తీసుకువచ్చి చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకున్నారని విమర్శించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఇవాళ అమరావతికి అన్యాయం జరిగిందని, రేపు ఇలాగే విశాఖకు కూడా చేస్తారని ఆయన అన్నారు. అలాగే కర్నూలుకు కూడా అన్యాయం చేస్తారని.. ఐదు కోట్ల ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని లేకేష్ సూచించారు.


రాజధాని కోసం రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారని, వాళ్లకు అన్యాయం చేయకూడదని లోకేష్ అన్నారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చి.. వైజాగ్ వెళ్లిన తర్వాత పులివెందుల రౌడీలతో అడ్డుకున్నారని మండిపడ్డారు.

Updated Date - 2020-03-02T23:55:25+05:30 IST