తన్నులు తిని మసాజ్ అంటారా?
ABN , First Publish Date - 2020-12-20T08:37:21+05:30 IST
‘‘వైసీపీ వాళ్లతో తన్నులు తిని మసాజ్ చేయించుకున్నామని చెప్పడానికి సిగ్గుగా లేదా? పోలీసుశాఖ ఆత్మగౌరవాన్ని జగన్‌రెడ్డి కాళ్ల దగ్గర తాకట్టుపెట్టకండి. అధికార పార్టీని ప్రసన్నం చేసుకోడానికి కొంతమంది పోలీసులు పూర్తిగా దిగజారిపోతున్నారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు

పోలీస్ శాఖ ఆత్మగౌరవం జగన్‌రెడ్డి
కాళ్ల దగ్గర తాకట్టు పెట్టొద్దు: లోకేశ్
అమరావతి/అనంతపురం,డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ వాళ్లతో తన్నులు తిని మసాజ్ చేయించుకున్నామని చెప్పడానికి సిగ్గుగా లేదా? పోలీసుశాఖ ఆత్మగౌరవాన్ని జగన్‌రెడ్డి కాళ్ల దగ్గర తాకట్టుపెట్టకండి. అధికార పార్టీని ప్రసన్నం చేసుకోడానికి కొంతమంది పోలీసులు పూర్తిగా దిగజారిపోతున్నారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. దౌర్జన్యానికి సంబంఽధించినవంటూ వీడియోలను లోకేశ్ తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. కాగా, వైసీపీ నేతలు తిట్టేటప్పుడు ఏపీ పోలీ్‌సశాఖ నిద్రపోతోందా? అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నిలదీశారు. విశాఖలో పోలీసు అధికారిపై దాడి చేసిన వైసీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీని కోరారు. సోషల్ మీడియాతో దుష్ప్రచారం చేస్తే చర్యలు అంటున్న విశాఖ ఏసీపీ మూర్తి మీడియాకి స్టేట్‌మెంట్స్ ఇచ్చే ముందు కానిస్టేబుల్‌పై జరిగిన దాడి ఘటన వీడియోలు చూస్తే బాగుండేందని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ సూచించారు.
వైసీపీ వాళ్లతో మసాజ్‌లు చేయించుకోవడం మాని, ఏపీ పోలీస్ అధికారుల సంఘం లెటర్ హెడ్‌ని కొట్టేసిన దొంగల్ని పట్టుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌పాత్రుడు సూచించారు. విజయసాయిరెడ్డి సావాసం పట్టి, నీకు కూడా మతిమరుపు రోగం వచ్చిందా? అని వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్‌ని టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. జగన్ మోసం చేయని బీసీ కులం ఏదైనా ఉందా? అని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు.
జగన్ దళితల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు మండిపడ్డారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలోనే మహిళలకు రక్షణ కరువైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. దివిస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న 160 మందిపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపడందారుణమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులైతే పోలీసులను తన్నొచ్చు, తిట్టొచ్చని జగన్ కొత్త చట్టం తెచ్చారా?అని టీడీపీ నేత బుద్దా వెంకన్న పోలీసు అధికారుల సంఘాన్ని శనివారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.