-
-
Home » Andhra Pradesh » Lokesh
-
సీఎం స్వగ్రామంలోనే మహిళలకు రక్షణ లేదు: లోకేశ్
ABN , First Publish Date - 2020-12-10T09:03:52+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ‘‘పులివెందుల నియోజకవర్గం పెద్దకుడాల గ్రామంలో దళిత మహిళ నాగమ్మ

అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ‘‘పులివెందుల నియోజకవర్గం పెద్దకుడాల గ్రామంలో దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి గురైంది. ఈ విషయం బయటకు రాకుండా చేయడానికి ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలి. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి నిందితులను శిక్షించాలి. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. చట్టాల పేరు చెప్తూ కాలయాపన తప్ప మృగాళ్లను శిక్షించింది లేదు. మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి’’అని లోకేశ్ ట్వీట్ చేశారు.