ఆ హవాలా వెనుక కింగ్‌పిన్ ఎవరో!: లోకేశ్
ABN , First Publish Date - 2020-07-18T08:54:56+05:30 IST
తమిళనాడులో భారీగా పట్టుబడిన డబ్బుల వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్

అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో భారీగా పట్టుబడిన డబ్బుల వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విటర్‌లో స్పందించారు. ‘‘మంత్రి బాలినేని హవాలా ‘అడవి’ని పెంచడానికి ఏ ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ని ఉపయోగించారు. పూర్తి ‘ఎనర్జీ’తో ఈ తంతు నడపడానికి సేఫ్ ‘ఎన్విరాన్‌మెంట్’ని ఎవరు సృష్టించారు? విశ్వసనీయ కథనం ప్రకారం తమిళనాడులో పట్టుబడిన రూ.5.27 కోట్లు రూ.1200 కోట్లలో ఓ చిన్న భాగం. గత ఏడాది కాలంలో ఆ మొత్తం చెన్నై - బెంగళూరు మీదుగా హవాలా మార్గంలో మారిషస్ తరలించారు. దీని వెనుక ఉన్న కింగ్‌పిన్ ఎవరు? బాలినేని, జే ఫ్యామిలీని కాపాడుతున్నారు? లేక జే కుటుంబమే బాలినేని రక్షిస్తోందా!’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.