‘పోలీసుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది’

ABN , First Publish Date - 2020-05-17T20:10:35+05:30 IST

డాక్టర్ సుధాకర్‌పై పోలీసులు అనుసరించిన తీరు సభ్యసమాజం తలించుకునేలా ఉందని..

‘పోలీసుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది’

అమరావతి: డాక్టర్ సుధాకర్‌పై పోలీసులు అనుసరించిన తీరు సభ్యసమాజం తలించుకునేలా ఉందని సీపీఎం నేత లోకనాథం విమర్శించారు. సుధాకర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరుపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రక్షణ పరికరాలు ఇవ్వలేదని ప్రశ్నించినంత మాత్రాన డాక్టర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఆయనను మానసికంగా, నైతికంగా దెబ్బతీసిందని విమర్శించారు.


ఒక డాక్టర్ తనకు అన్యాయం జరిగిందని చెప్పి.. నిరసన తెలిపితే పోలీసులు ఆయన రెండు చేతులూ వెనక్కి కట్టి, లాఠీతో కొడుతూ.. ఆటోలో తీసుకువెళ్లారని, ఇది ఎంతవరకు న్యాయమని లోకనాథం ప్రశ్నించారు. కరోనా బాధితులకు డాక్టర్లు చేస్తున్న సేవలకు అందరూ పూలవర్షం కురిపిస్తుంటే... డాక్టర్ సుధాకర్‌పై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం సరికాదన్నారు. సమస్యలపై ఎవరూ ప్రశ్నించకూడదా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పుడు డాక్టర్లంతా భయపడుతున్నారని, వైద్యుల ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం దెబ్బతిస్తోందని లోకనాథం తీవ్రస్థాయిలో విమర్శించారు.


Updated Date - 2020-05-17T20:10:35+05:30 IST