మిడతల దండు అలజడి
ABN , First Publish Date - 2020-06-01T08:12:20+05:30 IST
విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీలో మిడతల దండు అలజడి సృష్టిస్తోంది. పాచిపెంట మండలం గొట్టూరు పంచాయతీ ..
సాలూరు రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు: విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీలో మిడతల దండు అలజడి సృష్టిస్తోంది. పాచిపెంట మండలం గొట్టూరు పంచాయతీ చిమిడివలస అటవీ ప్రాంతంలో వందల సంఖ్యలో మిడతలు వివిధ చెట్లపై తిష్ట వేసి ఉన్నాయి. వీటి పరిశీలనకు వ్యవసాయశాస్త్రవేత్తలు సోమవారం రానున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఉప్పాడ రైల్వేగేటు వద్ద, ప్రత్తిపాడు మండలం ధర్మవరంలోనూపెద్ద ఎత్తున్న మిడతలు కనిపించాయి.