పేదలకు ఇబ్బంది లేకుండా చూడాలి: కన్నా

ABN , First Publish Date - 2020-03-24T09:30:24+05:30 IST

‘‘కరోనా కట్టడికి లాక్‌ డౌన్‌ చేసిన ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఉపాధి కోల్పోతున్న పేదలకు...

పేదలకు ఇబ్బంది లేకుండా చూడాలి: కన్నా

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా కట్టడికి లాక్‌ డౌన్‌ చేసిన ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఉపాధి కోల్పోతున్న పేదలకు ఆర్థిక సహాయం అందజేయాలి’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. సోమవారం సీఎంకు ఆమేరకు ఓ లేఖ రాశారు. ఏపీలో తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ తక్షణమే ఉచితంగా రేషన్‌ అందించాలన్నారు. గ్రామ వాలంటీర్లకు పంపిణీ ద్వారా వైరస్‌ వ్యాపించే ప్రమాదం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా బార్లు, వైన్‌ షాపులు, ఇతరత్రా జనరద్దీ ప్రాంతాలను మూసివేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణలో తీసుకొంటున్న చర్యలు అభినందనీయమని కన్నా ట్విటర్‌లో కొనియాడారు.

Read more