లాక్‌డౌన్‌ నిబంధనలు అమలవ్వాల్సిందే

ABN , First Publish Date - 2020-04-25T09:47:48+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలు అమలవ్వాల్సిందే

లాక్‌డౌన్‌ నిబంధనలు అమలవ్వాల్సిందే

కేంద్ర హోం శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలతోపాటు ఇతర ప్రాంతాల్లో అత్యవసర వాహనాలు కాకుండా వ్యక్తిగత వాహనాలు రోడ్లపైకి రానీయకూడదంటూ రాష్ట్ర రవాణాశాఖ శుక్రవారం విడుదల చేసిన జీవోలో పేర్కొంది. అనుమతిచ్చిన వాహనాల్లో నిబంధనల ప్రకారం ఇద్దరికన్నా ఎక్కువ ప్రయాణీకులున్నా, అనుమతులు లేని వాహనం వచ్చినా మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. లారీ యజమానులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి ఇద్దరికి మించి వాహనంలో ఉండకుండా చూసేలా చెప్పాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 

Updated Date - 2020-04-25T09:47:48+05:30 IST