-
-
Home » Andhra Pradesh » Lockdown rules Center
-
కేంద్ర నిబంధనలన్నీ యథాతథం
ABN , First Publish Date - 2020-05-18T08:43:19+05:30 IST
లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్రం జారీచే సిన ఉత్తర్వులు రాష్ట్రంలో యథాతథంగా అమలవుతాయని ప్రభుత్వం పేర్కొంది.

- లాక్‌డౌన్‌పై రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు
- బస్సులపై త్వరలో నిర్ణయం
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులు రాష్ట్రంలో యథాతథంగా అమలవుతాయని ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్ నిబంధనలు కూడా కేంద్రం జారీచేసినవే అమల్లో ఉంటాయని పేర్కొంది. అంతర్రాష్ట్ర బస్సు రవాణా, రాష్ట్రం పరిధిలో బస్సుల రవాణా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం నిర్ణయాధికారాన్ని అప్పగించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బస్సులు తిరిగేందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే బస్సులు తిరిగేందుకు మినహాయింపు ఇచ్చే విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
లాక్‌డౌన్ కారణంగా పలుచోట్ల చిక్కుకుపోయిన వారిని సొంత ప్రాంతాలకు పంపించడంపై ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనలే కొనసాగుతాయని పేర్కొంది. పోలీసు శాఖ అనుమతి, పాస్ తీసుకుంటేనే రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు అనుమతిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచే సింది.