శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-04-24T16:32:50+05:30 IST

శ్రీకాళహస్తిలో శుక్రవారం ఉదయం నుంచి సంపూర్ణంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.

శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్‌డౌన్

శ్రీకాళహస్తిలో శుక్రవారం ఉదయం నుంచి సంపూర్ణంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కూరగాయలు ఆటోలద్వారా విక్రయాలు చేస్తున్నారు. పాలు డోర్ డెలివరీ చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడక్కడ జనం కనిపిస్తున్నారు. దీంతో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి అర్బన్ ఎస్పీ హెచ్చరించారు. పాజిటీవ్ కేసులు పెరుగుతుండడంతో ఆంక్షలు కఠినతరం చేశామని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.


మరోవైపు శ్రీకాళహస్తిలోని రెడ్‌జోన్ ప్రాంతమైన ముత్యాలమ్మ గుడివీధిలో ప్రత్యేక అధికారులు పర్యటించారు. వార్డులో పరిస్థితిని పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెట్రోల్‌ బంకులను కూడా మూసేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Updated Date - 2020-04-24T16:32:50+05:30 IST