ఒంగోలులో మరోసారి లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-06-22T08:42:53+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు.

ఒంగోలులో మరోసారి లాక్‌డౌన్‌

  • చీరాలలో నేడు 24గంటలూ...

కరోనా నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశాలతో ఆదివారం నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నగర శివారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాలను, జనసంచారాన్ని నియంత్రించారు. చీరాలలో నాలుగు రోజుల నుంచే లాక్‌డౌన్‌ అమలులో ఉంది. సోమవారం 24గంటలపాటు లాక్‌డౌన్‌ విధించారు. ఉదయం నిత్యావసరాలు, కూరగాయలు దుకాణాలు కూడా తెరవకూడదని ప్రకటించారు. జిల్లాలో పలు ఇతర పట్టణాల్లోనూ పాక్షికంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. 

Updated Date - 2020-06-22T08:42:53+05:30 IST