-
-
Home » Andhra Pradesh » lockDown Continues In Andhra Pradesh
-
ఏపీలో లాక్ డౌన్ పొడిగింపుపై జగన్ సర్కార్ క్లారిటీ
ABN , First Publish Date - 2020-05-18T17:13:10+05:30 IST
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నియంత్రణకు గాను కేంద్ర ప్రభుత్వం

అమరాతి : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నియంత్రణకు గాను కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను మరోసారి పొడిగించిన విషయం తెలిసిందే. ఈ 4.0 లాక్ డౌన్ మే-18 నుంచి 31వరకు అమలులో ఉండనుంది. కాగా ఆదివారం రోజే మార్గర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. అయితే ఈ లాక్ డౌన్‌పై జగన్ సర్కార్ తాజాగా స్పందించింది. ఈ మేరకు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపు ఉంటుందని సర్కార్ స్పష్టం చేసింది. ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ పొడిగించింది. ఈ మేరకు సోమవారం నాడు జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను జీవోలో పేర్కొంది.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో గతవారం రోజులుగా కరోనా ఉధృతి తగ్గినట్లే అనిపించిన గత 24 గంటలుగా ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. ఆదివారం నాడు 25 కేసులు నమోదవ్వగా.. గడిచిన 24 గంటలుగా ఆ కేసులకు డబుల్ అయ్యాయి. కొత్తగా 52 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఈ కొత్త కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,282కి చేరింది.