నేటి నుంచి అమలాపురంలో మళ్లీ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-06-23T12:38:23+05:30 IST

నేటి నుంచి అమలాపురంలో మళ్లీ లాక్‌డౌన్‌

నేటి నుంచి అమలాపురంలో మళ్లీ లాక్‌డౌన్‌

తూర్పు గోదావరి/అమలాపురం(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 కేసులు విజృంభిస్తున్న తరుణంలో కోనసీమ కేంద్రమైన అమలాపురం పట్టణంతో పాటు అమలా పురం రూరల్‌, అయినవిల్లి మండలాల్లో మంగళవారం నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. శనివారం రాత్రి అమలాపురంలో ఓ వ్యక్తి కరోనా వైరస్‌తో మరణించిన నేపథ్యంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా డివిజన్‌ స్థాయిలో కొవిడ్‌-19 కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా, అదనపు డీఎం హెచ్‌వో డాక్టర్‌ సీహెచ్‌ పుష్కరరావులతో చర్చించి 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు చేస్తామన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలను తెరుచుకోవచ్చు. ఆ తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మద్యం షాపుల నిర్వహణ విషయంలో ప్రొసీడింగ్స్‌ ఇస్తామని తెలిపారు. కాగా అమలాపురం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు తమ కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ అమలు చేయాలని చేసిన సూచనతో ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్ణయం పట్ల చిరు వ్యాపారుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కులు ధరించాల్సిందేనని, లేనిపక్షంలో ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా విధిస్తామని ఆర్డీవో హెచ్చరించారు. 

Updated Date - 2020-06-23T12:38:23+05:30 IST