లాక్‌‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ నేత

ABN , First Publish Date - 2020-04-25T01:32:40+05:30 IST

రాష్ట్రంలో కరోనా మహమ్మార విజృంభిస్తున్న వేళ లాక్‌డౌన్ నిబంధనలు సామాన్యులకే కానీ, తమకు కాదనే రీతిలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. తాజాగా జిల్లాలో వైసీపీ కార్యకర్తలు

లాక్‌‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ నేత

విశాఖపట్నం: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ లాక్‌డౌన్ నిబంధనలు సామాన్యులకే కానీ, తమకు కాదనే రీతిలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. తాజాగా జిల్లాలో వైసీపీ కార్యకర్తలు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేత, స్వచ్ఛంద సామాజిక సేవా ప్రముఖ్ షేక్ ఇస్మాయిల్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మునగపాక మండలం గవర్లపాలెంలో జరిగిన ఇస్మాయిల్ జన్మదిన వేడుకలకు సుమారు వంద మంది హాజరయ్యారు. అయితే దీనిపై స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2020-04-25T01:32:40+05:30 IST