లాక్‌డౌన్ ఉల్లంఘించిన పాస్టర్లపై కేసు
ABN , First Publish Date - 2020-04-05T08:36:49+05:30 IST
ఢిల్లీ మర్కజ్ సమావేశం లింకులతో రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యం లో మతపరమైన సమావేశాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి పశ్చిమగోదావరి
తాడేపల్లిగూడెం క్రైం, ఏప్రిల్ 4: ఢిల్లీ మర్కజ్ సమావేశం లింకులతో రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యం లో మతపరమైన సమావేశాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఓ చర్చిలో 49 మంది పాస్టర్లు సమావేశం అవ్వడంపై పోలీసుల దృష్టి పడింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.