-
-
Home » Andhra Pradesh » Local should be postponed
-
‘స్థానికం’ వాయిదా వేయాలి
ABN , First Publish Date - 2020-12-10T08:58:20+05:30 IST
‘‘పదుల సంఖ్యలో కరోనా కేసులు వచ్చినప్పుడే ఎన్నికల సంఘం ఎన్నికలను రద్దు చేసింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.

ఎన్జీఓ నేత చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 9: ‘‘పదుల సంఖ్యలో కరోనా కేసులు వచ్చినప్పుడే ఎన్నికల సంఘం ఎన్నికలను రద్దు చేసింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. రోజూ వందల, వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు జరపాలనడం భావ్యం కాదు. ఎన్నికలు వాయిదా వేయాలి’’ అని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి కోరారు.
నెల్లూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు జరిపి ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దన్నారు. అవవసరమైతే దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. ప్రభుత్వం 11వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.