వచ్చే వేసవిలో స్థానిక ఎన్నికలు

ABN , First Publish Date - 2020-12-06T08:34:57+05:30 IST

‘‘వచ్చే ఏడాది వేసవిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో 90ు స్థానాలు సాధిస్తాం. లేనిపక్షంలో నేను రాజీనామా చేస్తా.

వచ్చే వేసవిలో స్థానిక ఎన్నికలు

90 శాతం గెలవకుంటే రాజీనామా... సిద్ధమా!

టీడీపీకి మంత్రి కొడాలి సవాల్‌


గుడివాడ, డిసెంబరు 5: ‘‘వచ్చే ఏడాది వేసవిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో 90ు స్థానాలు సాధిస్తాం. లేనిపక్షంలో నేను రాజీనామా చేస్తా. టీడీపీ నుంచి చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు నా సవాల్‌ స్వీకరించే దమ్ముందా!’’ అని మంత్రి కొడాలి నాని సవాల్‌ చేశారు. స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో శనివారం మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించవద్దని అసెంబ్లీలో తీర్మానం చేశామని తె లిపారు. ఎన్నికల కమిషన్‌ ముసుగులో చంద్రబాబు చెప్పినట్టు ఆడుతున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శ్రీరంగనీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుపతి, విశాఖ, ఒంగోలు, గుంటూరు, కర్నూలు కార్పొరేషన్లకు కాలపరిమి తి పూర్తయినా ఎన్నికలు నిర్వహించలేదేమని నిలదీశారు. అసెంబ్లీ తీర్మా నం చేస్తే రమేశ్‌కుమార్‌, గవర్నర్‌కు లేఖ రాయడమేంటని అన్నారు.


ప్రజానేత జగన్‌ని ఢీ కొడతాననడం చంద్రబాబు అవివేకం

అమరావతి: ‘‘ప్రజా నేత, సీఎం జగన్‌ను ఢీ కొడతానని చంద్రబాబు అన డం హాస్యాస్పదం. అవివేకంతో మాట్లాడుతున్నారు. టీడీపీని గాలి పార్టీగా మార్చిన చంద్రబాబు గాలి నాయకుడుగా మిగిలిపోయారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావు’’ అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. శనివారం ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్క డివిజన్‌లోనూ డిపాజిట్‌ను దక్కించుకోలేకపోయిన టీడీపీకి జాతీయ హోదా ఎందుకన్నారు.  

Read more