గ్యాస్ సిలిండర్‌లో మద్యం తరలింపు.. సీజ్
ABN , First Publish Date - 2020-08-22T21:51:22+05:30 IST
జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలంలో అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని గ్యాస్ సిలిండర్‌లో తరలిస్తున్న
కృష్ణా: జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలంలో అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని గ్యాస్ సిలిండర్‌లో తరలిస్తున్న చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ వాసు, గోపి, నందిగామకు చెందిన యలగుందుల ఉదయ్ శ్రీనులను పోలీసులు పట్టుకున్నారు. 100 మద్యం బాటిల్స్, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.