పట్టుకున్న మద్యం మాయం..!

ABN , First Publish Date - 2020-09-18T16:42:08+05:30 IST

స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను మాయం చేసిన అభియోగంపై జిల్లాలోని జంగారెడ్డిగూడెం టౌన్‌ ఎస్‌ఐ గంగాధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్‌ఈబీ ఏఎస్పీ కరీముల్లా షరీఫ్‌ విలేకర్లతో

పట్టుకున్న మద్యం మాయం..!

పశ్చిమగోదావరి : స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను మాయం చేసిన అభియోగంపై జిల్లాలోని జంగారెడ్డిగూడెం టౌన్‌ ఎస్‌ఐ గంగాధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్‌ఈబీ ఏఎస్పీ కరీముల్లా షరీఫ్‌ విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేసిన కేసుల్లో ఎన్‌డీపీఎల్‌ లిక్కర్‌ వివరాలను అందించాలని ఆదేశించామని, ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌వో రామకృష్ణ సీజ్‌ చేసిన మద్యం సీసాల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇద్దరు ఎస్‌ఈబీ అధికారులతో విచారణ జరపగా.. ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబరు వరకు పట్టుబడ్డ మద్యం సీసాల్లో 24 సీసాలు మాయం చేసి, వాటి స్థానంలో వేరే సీసాలను ఉంచినట్లు గుర్తించారన్నారు. అదే విధంగా కేసులకు సంబంధం లేని 51 అనధికార మద్యం బాటిళ్లను గుర్తించినట్లు తెలిపారు. దీనిపై ఎస్‌ఐ గంగాధర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు షరీఫ్‌ తెలిపారు.

Updated Date - 2020-09-18T16:42:08+05:30 IST