ఎల్జీ పాలిమర్స్‌ ఘటన చాలా తీవ్రమైన ప్రమాదం: సీపీఐ నేత మూర్తి

ABN , First Publish Date - 2020-05-10T01:37:29+05:30 IST

విశాఖ ఘటనను చాలా చిన్నదిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని, అమరావతిని అందుకే తెరపైకి తెచ్చారని సీపీఐ నేత మూర్తి చెప్పారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన చాలా తీవ్రమైన ప్రమాదమని అన్నారు.

ఎల్జీ పాలిమర్స్‌ ఘటన చాలా తీవ్రమైన ప్రమాదం: సీపీఐ నేత మూర్తి

హైదరాబాద్: విశాఖ ఘటనను చాలా చిన్నదిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని, అమరావతిని అందుకే తెరపైకి తెచ్చారని సీపీఐ నేత మూర్తి చెప్పారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన చాలా తీవ్రమైన ప్రమాదమని అన్నారు. ఇంకా 54 మంది చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, గ్యాస్‌ ప్రభావంతో ఈరోజు ఓ చిన్నారి ఆస్పత్రిలో చేరిందని తెలిపారు. రాజధాని వైపు చర్చను మళ్లించి విశాఖ ఘటనను తప్పిస్తున్నారని ఆరోపించారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. కొన్ని వేలమందిపై గ్యాస్‌ ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుందని, ఎల్జీ పాలిమర్స్‌ పరిసరాల్లో జలవనరులన్నీ కలుషితమయ్యాయని చెప్పారు. యాజమాన్యంపై ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని మూర్తి ప్రశ్నించారు.

Updated Date - 2020-05-10T01:37:29+05:30 IST