తొలగని ముప్పు

ABN , First Publish Date - 2020-05-09T10:18:00+05:30 IST

ఎల్‌జీ పా లిమర్స్‌ కంపెనీలో గ్యాస్‌లీక్‌ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. గురువారం రాత్రి కూడా రెండు, మూ డుసార్లు ఘాటైన గ్యాస్‌ లీకైంది.

తొలగని ముప్పు

కొనసాగుతున్న  ఘాటు వాసన 

గ్యాస్‌లీక్‌ పూర్తి నియంత్రణకు మరో 24 గంటలు

వాతావరణ కాలుష్యంపై ‘నీరి’ నిపుణుల పరిశీలన


విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి): ఎల్‌జీ పా లిమర్స్‌ కంపెనీలో గ్యాస్‌లీక్‌ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. గురువారం రాత్రి కూడా రెండు, మూ డుసార్లు ఘాటైన గ్యాస్‌ లీకైంది. శుక్రవారం కూడా దఫదఫాలుగా లీకవుతూనే ఉంది. ప్రమాదం జరి గి 24గంటలు గడిచినా కంపెనీ పరిసరాల్లో వాసన కొనసాగడంతో స్థానికుల్లో భయాందోళన తొలగలే దు. లీక్‌ క్రమేపీ తగ్గుతున్నందున ప్రమాదం లేద ని మంత్రులు, అధికారులు, నిపుణులు చెబుతు న్నా ప్రజల్లో నమ్మకం కుదరడం లేదు. గ్యాస్‌ లీక్‌ను పూర్తిస్థాయిలో అరికట్టడానికి మరో 24 గం టలు పడుతుందని మంత్రులు అవంతి శ్రీనివాసరావు, మేకపాటి గౌతంరెడ్డి శుక్రవారం వెల్లడించారు. దీనిబట్టి పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని స్పష్టమవుతోంది.  


విచారణ ప్రారంభం 

ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘటనపై పలు విభాగాల ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. బాయిలర్స్‌ విభాగం డైరెక్టర్‌ ఉమామహేశ్వరరావు, ఫ్యాక్టరీస్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌వర్మ నేతృత్వంలో ఒక బృందం ఘటనా స్థలాన్ని శుక్రవారం పరిశీలించింది. తొలుత కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన ఉన్నతాధికారులు గ్యాస్‌లీక్‌, తదనంతర పరిణామాలను తెలుసుకున్నారు. కాగా, గ్యాస్‌లీక్‌తో వాతావరణ కాలుష్యాన్ని ని ర్ధారించడానికి నాగపూర్‌కు చెం దిన నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌(నీరి) నిపుణుల బృందం విశాఖకు వచ్చింది.


పుణెలో ఉంటున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులతో కలిసి ‘నీరి’ నిపుణులు కంపెనీలో అన్ని విభాగాలు, ప్రదేశాలను పరిశీలించి కాలుష్య తీవ్రతకు సంబంధించి వివరాలు నమోదు చేశారు. అధికారులు, నిపుణులు, కంపెనీ ప్రతినిధులతో మంత్రులు అవంతి, మేకపాటి సమీక్షించారు. కంపెనీలో ఎన్ని ట్యాంకులు ఉన్నాయి? వాటిలో కెమికల్స్‌ పరిస్థితి, ఉష్ణోగ్రతల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్ష నిర్వహించారు. ట్యాంకుల్లో కెమికల్‌ రియాక్షన్‌ తగ్గించి సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఏం చేస్తున్నారని సీఎస్‌ ప్రశ్నించారు. 


పరిస్థితి అదుపులోనే ఉంది: ఎల్‌జీ 

న్యూఢిల్లీ: విశాఖలోని తమ ప్లాంట్‌లో కొత్తగా ఎలాంటి గ్యాస్‌ లీకేజీలు లేవని ఎల్‌జీ పాలిమర్స్‌ శుక్రవారం ప్రకటించింది. అయితే ముందు జాగ్ర త్త చర్యగా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నవారిని ఖాళీ చేయించాలని అధికారులను కోరింది. ప్రస్తు తం పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొంది. రెండోసారి గ్యాస్‌లీక్‌పై మీడియాలో వచ్చిన వార్త లు తప్పని స్పష్టం చేసింది. 

Updated Date - 2020-05-09T10:18:00+05:30 IST