డీజీపీకి కన్నా లేఖ.. వైసీపీ దాడుల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

ABN , First Publish Date - 2020-07-16T03:16:38+05:30 IST

డీజీపీకి కన్నా లేఖ.. వైసీపీ దాడుల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

డీజీపీకి కన్నా లేఖ.. వైసీపీ దాడుల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. విజయనగరం జిల్లా బీజేపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డీజీపీని ఆయన కోరారు. వైసీపీ దాడుల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేస్తే సహించబోమని  కన్నా హెచ్చరించారు. 

Updated Date - 2020-07-16T03:16:38+05:30 IST