-
-
Home » Andhra Pradesh » leopard srisailam kurnool
-
చిరుత అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-12-27T23:35:47+05:30 IST
శ్రీశైలంలో సుండిపెంట ఈద్గా వద్ద చిరుత అనుమానాస్పదంగా మృతి చెందింది. రేసు కుక్కల దాడిలో చిరుత చనిపోయిందని ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్నారు.

కర్నూలు: శ్రీశైలంలో సుండిపెంట ఈద్గా వద్ద చిరుత అనుమానాస్పదంగా మృతి చెందింది. రేసు కుక్కల దాడిలో చిరుత చనిపోయిందని ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్నారు. చిరుత వయసు నాలుగు సంవత్సరాల లోపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. చిరుత మృతిపై అధికారులు ఆరా తీస్తున్నారు. చిరుత మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చిరుత మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.