కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో చిరుత సంచారం..
ABN , First Publish Date - 2020-12-29T18:19:32+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ఏజెన్సీలో రెండు చిరుతపులుల సంచారం స్థానిక ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ఏజెన్సీలో రెండు చిరుతపులుల సంచారం స్థానిక ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. తెలంగాణ సరిహద్దు కుక్కునూరు మండలం ఇసుకపాడు సమీపంలో లేగదూడను చిరుత చంపేసింది. ఇసుక పాడు వద్ద పోడు భూముల్లో పాకలు వేసుకున్న గిరిజనుల్లో భయందోళనలు వ్యక్తమవుతున్నాయి. వేలేరుపాడు మండలం కొట్కూరు, కొయిదా ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారుల నిర్ధారించారు. పశువులను చంపి మూడు వందల మీటర్ల మేర ఈడ్చుకు వెళ్లింది. అందరూ అనుకుంటున్నట్లు పులి కాదు.. చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ వెల్లడించింది. చిరుత జాడ కోసం అటవీశాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.