తిరుపతిలో చిరుత కలకలం..

ABN , First Publish Date - 2020-08-20T17:47:50+05:30 IST

శేషాచలంలోని చిరుతలు జనావాసాలమధ్యకు వస్తున్నాయి.

తిరుపతిలో చిరుత కలకలం..

తిరుపతి: శేషాచలంలోని చిరుతలు జనావాసాలమధ్యకు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా శేషాచలం దిగువన ఉన్న తిరుపతి. అలిపిరి, నగరవనం, కపిలతీర్థం, జీవకోన పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. గత అర్థరాత్రి సమయంలో తిరుపతి, జీవకోన జీవలింగేశ్వర స్వామి ఆలయంలో చిరుత సంచరిస్తోందని స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే ఓ యువకుడిపై చిరుత దాడి చేసి గాయపరిచింది. తిరుపతి అలిపిరి చెర్లోపల్లి జూ పార్క్‌ రోడ్డులో యువకుడిపై చిరుత దాడి చేసింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-08-20T17:47:50+05:30 IST