తూర్పు ఏజెన్సీలో ఘోరం.. బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునక

ABN , First Publish Date - 2020-08-21T01:39:35+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.!

తూర్పు ఏజెన్సీలో ఘోరం.. బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునక

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.! చింతూరులోని శబరి నది బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునిగిపోయింది.!. లాంచీలో వరద ముంపు బాధితులు ఉన్నట్లు సమాచారం. చీకటి కావడంతో లాంచీలో ఎంత మంది ఉన్నారనే విషయం తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై రెవెన్యూ సిబ్బంది మాట్లాడుతూ లాంచీలో ఎంత మంది ఉన్నారో ఇంకా తెలియట్లేదని త్వరలోనే వివరాలు తెలియజేస్తాన్నారు. 


కాగా.. వరద బాధితులకు ముగ్గురు వ్యక్తులు లాంచీలో నిత్యవసర వస్తువులు పంచి వస్తుండగా చింతూరు బ్రిడ్జి వద్ద లాంచీ బ్రిడ్జిని ఢీ కొని మునిగిపోయినట్లు తెలియవచ్చింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గత నాలుగైదు రోజులుగా గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే ఉధృతి ఉంటుందని తెలుస్తోంది.

Updated Date - 2020-08-21T01:39:35+05:30 IST