కార్తీక మాసం ఆఖరి రోజు.. పోటెత్తిన భక్తులు..

ABN , First Publish Date - 2020-12-15T16:22:24+05:30 IST

కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు.

కార్తీక మాసం ఆఖరి రోజు.. పోటెత్తిన భక్తులు..

విజయవాడ: కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. నదిలో కార్తీక దీపాలను వదులుతున్నారు. పోలి స్వర్గానికి పంపడంతో కార్తీక మాసం ముగిస్తుంది. భక్తులు కృష్ణానది ఒడ్డున అరటి డోప్పలలో కార్తీక దీపాలను వెలిగించి నదిలోకి వదిలి నమస్కరిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి భక్తులు నదిలో స్నానమాచరించి కార్తీక దీపాలను వదులుతున్నారు. కార్తీక దామోదరుడికి విశేషంగా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలుతో  పూజలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-12-15T16:22:24+05:30 IST