-
-
Home » Andhra Pradesh » land grabbing nellore minister anil kumar village
-
మంత్రి అనిల్ సొంతూరులో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు
ABN , First Publish Date - 2020-06-23T22:47:42+05:30 IST
రాష్ట్రంలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. స్వయంగా మంత్రి అనిల్ స్వగ్రామంలోనే భూకబ్జాదారులు చెలరేగిపోయారు. పెన్నా పరివాహక ప్రాంతంలో రూ.350 కోట్ల విలువైన 700 ఎకరాల భూమిని కబ్జా

నెల్లూరు: రాష్ట్రంలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. స్వయంగా మంత్రి అనిల్ స్వగ్రామంలోనే భూకబ్జాదారులు చెలరేగిపోయారు. పెన్నా పరివాహక ప్రాంతంలో రూ.350 కోట్ల విలువైన 700 ఎకరాల భూమిని కబ్జా చేశారు. అలా అక్రమించుకున్న భూముల్లో వేరుశెనగ పంట సాగు చేస్తున్నారు. కిలోమీటర్ల దూరం కర్రలపై విద్యుత్ లైన్లను లాగి అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. కాగా, నదీపరివాహక ప్రాంతం కబ్జా కావడంతో గడ్డి లేక పశువులు, గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పొట్టెపాలెం గ్రామ సచివాలయం ఎదుట పాడి రైతులు నిరసనకు దిగారు.