రాత్రికి రాత్రే దున్నేశారు

ABN , First Publish Date - 2020-02-22T09:04:52+05:30 IST

సమాచారం ఇవ్వరు.. ఇష్టాయిష్టాలను కనుక్కోరు..సంప్రదింపులు జరపరు..గ్రామసభల మాట అసలే తలవరు..పగలు కన్నేసిన పొలాలను రాత్రి దున్నేయడమే! పేదలకు స్థలాలు పంచాలంటే కొని ఇవ్వాలి.

రాత్రికి రాత్రే దున్నేశారు

పగలు కన్నేసి చీకట్లో దున్నేసి..

‘అసైన్డు’ అంటే ఎగబడటమే

పంట చేలో ఉండగానే దాష్టీకం

అడగకుండానే నోటీసు,కొలతలు

చూస్తుండగానే భూమి చదును

రాష్ట్రమంతటా సేక‘రణా’లే

సమాచారం ఇవ్వరు.. ఇష్టాయిష్టాలను కనుక్కోరు..సంప్రదింపులు జరపరు..గ్రామసభల మాట అసలే తలవరు..పగలు కన్నేసిన పొలాలను రాత్రి దున్నేయడమే! పేదలకు స్థలాలు పంచాలంటే కొని ఇవ్వాలి. బడ్జెట్‌ కేటాయించి..ముందుకొచ్చినవారి నుంచి సేకరించాలి. ‘అంత బడ్జెట్‌’ లేదని..పేదలు, దళితుల వినియోగంలోని అసైన్డు, డీ పట్టా స్థలాలను అధికారులు లాగేసుకొంటున్నారు. పంట పొలంలో ఉండగానే, బలవంతంగా సేకరిస్తున్న తీరు రాష్ట్రమంతటా మంట పెడుతోంది. 

ఇది ఐదు ఎకరాల అరటి పంట. 8మంది బీసీ పేదలు సాగు చేసుకొంటున్నారు. విజయనగరం జిల్లా రాకోడుగెడ్డలోని ఈ భూములను వీరికి 1986లో అప్పటి ప్రభుత్వం పండించుకోడానికి ఇచ్చింది. స్థలాల వేటలో ఉన్న రెవెన్యూ అధికారుల  కన్ను ఈ పొలాలపై పడింది. గురువారం రాత్రి యంత్రాలతో వచ్చారు. పది రోజుల్లో కాపుకొచ్చే పంటను ధ్వంసం చేయడానికి తెగబడ్డారు. రైతులు గట్టిగా అడ్డుకున్నారు. అప్పటికి వెళ్లిన అధికారులు.. శుక్రవారం పోలీసులతో సహా వచ్చారు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా వినకుండా పంటనంతా ధ్వంసం చేశారు. ప్లాట్లుగా చేయడానికి చదును చేయడం మొదలుపెట్టారు. 

చేతికొచ్చిన పంట చదును

పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురంలో ఐదుగురు పేదలు మూడు ఎకరాలు పండించుకొంటున్నారు. బాగా పండిన మొక్కజొన్న వారిలో ఆశలు మొలిపించింది. ఆ భూములను అధికారులు సేకరించాలనుకొన్నారు. రైతులు లేని సమయం చూసి రాత్రికి రాత్రే పంటనంతా నాశనం చేశారు. నేలకు వాలిపోయిన తమ కష్టాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరయ్యారు. పొలమంతా రాలిపోయిన మొక్కజొన్న కండెలను పోలవరం వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కు చూపించి రోదించారు. ముందుగా చెబితే పంటనైనా కాపాడుకొనేవారమని గొల్లుమన్నారు. సీఎం జగన్‌ దృష్టికి రైతుల సమస్యను తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. 

Updated Date - 2020-02-22T09:04:52+05:30 IST