కొత్త మెడికల్ కాలేజీలకు భూ కేటాయింపులు
ABN , First Publish Date - 2020-11-13T09:32:15+05:30 IST
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల కోసం భూములను కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల కోసం భూములను కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా పాడేరుకు సంబంధించి తలారిసింగి గ్రామంలో 35.01 ఎకరాలు, కర్నూలు జిల్లా నంద్యాల మండలం నూనెవారిపల్లిలో 50 ఎకరాలు, విజయనగరం మండలం గాజుల రేగలో 70 ఎకరాల భూమి చొప్పున భూములు కేటాయిస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు.