అదే ఊపు..!

ABN , First Publish Date - 2020-03-18T09:55:53+05:30 IST

‘ఎన్నికల కోడ్‌ వల్ల ఇళ్లస్థలాల కేటాయింపు పక్రియ నిలిచినా... దాని బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ ఆగొద్దు. ఎక్కడా ఆ కార్యక్రమం ఊపు తగ్గొద్దు’ అంటూ జేసీలకు రెవెన్యూశాఖ అధికారి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.

అదే ఊపు..!

  • భూ సేకరణ కొనసాగించాలి
  • ఇళ్ల స్థలాలపై జేసీలకు మౌఖిక ఆదేశాలు


అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికల కోడ్‌ వల్ల ఇళ్లస్థలాల కేటాయింపు పక్రియ నిలిచినా... దాని బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ ఆగొద్దు. ఎక్కడా ఆ కార్యక్రమం ఊపు తగ్గొద్దు’ అంటూ జేసీలకు రెవెన్యూశాఖ అధికారి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. భూ సేకరణ, లే అవుట్‌ల అభివృద్ధి, లబ్ధిదారుల డేటా ఎంట్రీ రోజువారీ రెవెన్యూ విధుల్లోకి వచ్చేవని, వాటికి ఎన్నికల కోడ్‌ వర్తించదన్నారు. కాబట్టి ఏమాత్రమూ ఊపు తగ్గకుండా బ్యాక్‌గ్రౌండ్‌ పనిని కొనసాగించాలని జాయింట్‌ కలెక్టర్‌లకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఇళ్లస్థలాల పంపిణీ వ్యక్తిగత లబ్ధి పరిధిలోకి వస్తుందని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నంత వరకూ దీన్ని నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడ్డా కోడ్‌మాత్రం కొనసాగుతుందని చెప్పారు. అయితే ప్రభుత్వ శాఖలు తమ రోజువారీ కార్యక్రమాలు చేపట్టవచ్చని ఈసీ స్పష్టత ఇచ్చిన నేపఽథ్యంలో ఇళ్ల స్థలాలపై రెవెన్యూశాఖ అంతర్గత సమీక్ష చేపట్టింది. ఆ ఊపు తగ్గకుండా ‘ఇళ్ల స్థలాల’ పనులను ముందుకు తీసుకెళ్లాలని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - 2020-03-18T09:55:53+05:30 IST