-
-
Home » Andhra Pradesh » Kurnool District
-
మంత్రాలయంలోని రాంపురంలో టెన్షన్ వాతావరణం
ABN , First Publish Date - 2020-12-19T15:07:40+05:30 IST
కర్నూలు జిల్లా: మంత్రాలయంలోని రాంపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

కర్నూలు జిల్లా: మంత్రాలయంలోని రాంపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తుంగభద్ర పుష్కరాల కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం పుష్కర ఘాట్ల పరిశీలనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తోంది. బీజేపీ, వైసీపీ కార్యక్రమాలతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.