-
-
Home » Andhra Pradesh » Kurnool dist
-
కర్నూల్ జిల్లా: వారం రోజుల్లో పెళ్లి.. అంతలో హత్య
ABN , First Publish Date - 2020-12-27T14:04:20+05:30 IST
ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు.

కర్నూల్ జిల్లా: ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మొఘల్ గఫర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. గఫర్ వంటి నిండా కత్తిపోట్లు ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతంలో కత్తి లభ్యమైనట్లు సమాచారం. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో పెళ్లి ఉండగా గఫర్ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన రాత్రి జగింది. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.