ఏపీ రాజధానిగా కర్నూలును ఎందుకు నిర్ణయించలేదు.. జగన్‌కు సూటి ప్రశ్న..

ABN , First Publish Date - 2020-12-11T21:13:21+05:30 IST

ఏపీ రాజధానిగా కర్నూలును ఎందుకు నిర్ణయించలేదో సీఎం జగన్ చెప్పాలని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. విశాఖపట్నానికి రాయలసీమకు సంబంధం లేదని

ఏపీ రాజధానిగా కర్నూలును ఎందుకు నిర్ణయించలేదు.. జగన్‌కు సూటి ప్రశ్న..

కర్నూలు: ఏపీ రాజధానిగా కర్నూలును ఎందుకు నిర్ణయించలేదో సీఎం జగన్ చెప్పాలని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. విశాఖపట్నానికి రాయలసీమకు సంబంధం లేదని, రాజధానితో ప్రతి సామాన్యుడికి అవసరం ఉంటోందని చెప్పారు. హైకోర్టు వద్దని. తమకు ప్రత్యేక రాష్ట్రమే కావాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ, విశాఖలో సెంటు భూమి కూడా కొనుక్కునే స్థితిలో సీమ ప్రజలు లేరని తెలిపారు. రాయలసీమ వాసుల జీవన విధానంలో హైదరాబాద్ ఒక భాగమని ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని సీమ యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 1991లోనే గ్రేటర్ రాయలసీమపై పార్లమెంటులో చర్చను తీసుకొచ్చానని తెలిపారు. 2007లో గ్రేటర్ రాయలసీమకు వైఎస్ఆర్ సుముఖత వ్యక్తం చేశారని గుర్తుచేశారు. 2013లో కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి లేఖ రాశానని, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సమర్థించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ‘45వేల కోట్లు వద్దని, ప్రత్యేక రాయలసీమే ముద్దు’  అని స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధాని కాబట్టే హైదరాబాద్ నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు.

Updated Date - 2020-12-11T21:13:21+05:30 IST