కర్నూలు జిల్లాలో విషాదం.. ముగ్గురు చిన్నారులు మృతి

ABN , First Publish Date - 2020-05-10T17:25:20+05:30 IST

జిల్లాలో కొలిమిగుండ్ల మండలం బెలూమ్‌ సింగవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలం దగ్గర నీటికుంటలో ఈతకెళ్లి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.

కర్నూలు జిల్లాలో విషాదం.. ముగ్గురు చిన్నారులు మృతి

కర్నూలు: జిల్లాలో కొలిమిగుండ్ల మండలం బెలూమ్‌ సింగవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలం దగ్గర నీటికుంటలో ఈతకెళ్లి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. సెలవుల్లో బనగానపల్లె నుంచి తాతయ్య ఊరికి వచ్చిన పిల్లలు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపతున్నారు. 

Updated Date - 2020-05-10T17:25:20+05:30 IST