మహానందికి నిలిచిన రాకపోకలు
ABN , First Publish Date - 2020-09-14T17:20:39+05:30 IST
జిల్లాలోని నంద్యాల, మహానంది, బండి అత్మకూరు మండలాలలో భారీగా వర్షం కురుస్తోంది.
కర్నూలు: జిల్లాలోని నంద్యాల, మహానంది, బండి అత్మకూరు మండలాలలో భారీగా వర్షం కురుస్తోంది. వరద ప్రభావంతో కుందూనది ఉదృతంగా ప్రవహిస్తోంది. అటుపాలేరు, మద్దిలేరు, రాళ్ళ వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మహానందికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు వందల ఎకరాలలో అరటి, వరి, పసుపు పంటలు నీట మునిగాయి.