శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద..మూడు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-08-20T12:22:01+05:30 IST

శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు డ్యాం మూడు గేట్ల పది అడుగుల మేర ఎత్తివేశారు.

శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద..మూడు గేట్లు ఎత్తివేత

కర్నూలు: శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు డ్యాం మూడు గేట్ల పది అడుగుల మేర ఎత్తివేశారు. ప్రస్తుతం డ్యాం ఇన్ ఫ్లో 4,30,566 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,91,362 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను... ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 204.78 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2020-08-20T12:22:01+05:30 IST