గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-09-16T14:27:24+05:30 IST

జిల్లాలోని కంచికచర్ల చెరువుకట్ట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కృష్ణా: జిల్లాలోని కంచికచర్ల చెరువుకట్ట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నందిగామ మండలం దాములురు గ్రామానికి చెందిన కందుల నాగరాజుగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-09-16T14:27:24+05:30 IST