కృష్ణానదిలో వలకు చిక్కిన భారీ కొండచిలువ

ABN , First Publish Date - 2020-10-08T20:50:19+05:30 IST

కృష్ణానదిలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. తోట్లవల్లూరు మండలం దేవరపల్లి వద్ద కృష్ణానదిలో జాలర్లు చేపలు పడుతుండగా

కృష్ణానదిలో వలకు చిక్కిన భారీ కొండచిలువ

కృష్ణా జిల్లా: కృష్ణానదిలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. తోట్లవల్లూరు మండలం దేవరపల్లి వద్ద కృష్ణానదిలో జాలర్లు చేపలు పడుతుండగా వలలో 15 అడుగుల కొండచిలువ చిక్కింది. వలను బయటకు లాగిన తర్వాత చూడగా చేపలతో పాటు భారీగా కొండచిలువ ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.


Updated Date - 2020-10-08T20:50:19+05:30 IST