కృష్ణా జిల్లాలో పట్టుబడిన అక్రమ మద్యం

ABN , First Publish Date - 2020-07-10T22:31:40+05:30 IST

జిల్లాలోని మోపిదేవిలో అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్న ముఠాను అవనిగడ్డ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి మద్యాన్ని తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను

కృష్ణా జిల్లాలో పట్టుబడిన అక్రమ మద్యం

కృష్ణా: జిల్లాలోని మోపిదేవిలో అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్న ముఠాను అవనిగడ్డ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి మద్యాన్ని తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 138 క్వార్టర్ బాటిళ్లు, 38 ఫుల్ బాటిళ్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, తెలంగాణలోని ఒక షాపు నిర్వాహకుడి ప్రోత్సాహంతోనే మద్యం అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - 2020-07-10T22:31:40+05:30 IST