కృష్ణాజిల్లా: దేవరగుంటలో దారుణం

ABN , First Publish Date - 2020-11-07T20:24:45+05:30 IST

కృష్ణాజిల్లా: దేవరగుంటలో దారుణం జరిగింది.

కృష్ణాజిల్లా: దేవరగుంటలో దారుణం

కృష్ణాజిల్లా: దేవరగుంటలో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరరావు ఓ వ్యక్తి దగ్గర రూ. 15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడంలేదని అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ పెద్దలు ఆదేశించారు. అయితే గడువు ముగిసినా బాకీ డబ్బులు ఇవ్వలేదంటూ వెంకటేశ్వరరావు, అతని కుమారుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వారిని విడిపించి.. నోటు రాయించి వెళ్లిపోయారు. 

Updated Date - 2020-11-07T20:24:45+05:30 IST