కృష్ణా: నర్సుకు కరోనా...భయాందోళనలో ప్రజలు
ABN , First Publish Date - 2020-04-26T17:15:11+05:30 IST
కృష్ణా: నర్సుకు కరోనా...భయాందోళనలో ప్రజలు

కృష్ణా: జిల్లాలోని ఉంగటూరు మండలం తరిగొప్పలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాచవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆమెను వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. నర్సుకు కరోనా లక్షణలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన వైద్యారోగ్యశాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులు... నర్సుతో కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు.